Edit Content

Discover peace at our Kurmagram vedic village. Learn meditation, find wisdom, and join our community on the path to enlightenment.

Address :

Address : Near Anthakapalli Village, Kittalapadu Post, Via Shrimukhalingam, Srikakulam District, Andhra Pradesh – 532428, India

Info :

Phone : +91-7732 075 607

Email : Kurmagramvv@gmail.com

కూర్మగ్రామము వర్ణాశ్రమ కళాశాలలో వృత్తుల శిక్షణ ప్రారంభం

🙏హరే కృష్ణ అందిరికీ ఆహ్వానం🙏

 
*కూర్మగ్రామము వర్ణాశ్రమ కళాశాలలో వృత్తుల శిక్షణ ప్రారంభం*
 
మే 1 వ తేది నుండి మే 31 వ తేది వరకు శిక్షణలు కొనసాగును  
 
భారతీయ సంస్కృతిని నెలకొల్పడం, స్వయం సమృద్ధి గ్రామాలను స్థాపించడం,
పూర్వపు వృత్తులను పునరుద్దరించుట కోసమై ఈ ప్రయత్నం. ఉద్యోగాలపై ఆధారపడకుండా పోషణ కోసమై స్వయం సమృద్ధిగా జీవించడం. వీటితో పాటు ఆధ్యాత్మిక శిక్షణ, సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, మనో ధైర్యం, బుద్ధి కుశలత, పరోపకారం, ఏకాగ్రత, క్రమమైన దైనందికచర్య మొదలగునవి యువకులకు శిక్షణ ఇవ్వబడుతాయి.
 
*Age Group: Batch 1 – 30 years (only for boys)*
 
వర్ణాశ్రమ కళాశాలలోని కార్యక్రమాలు
1. చేనేత మగ్గం (weaving)*
2. మట్టి కుండలు తయారు చేయడం (pottery)*
3. వడ్రంగి (carpentry)*
4. కర్ర సాము (stick fighting)*
5. నూనె గానుగ (bull driven oil mill)*
6. సున్నం గానుగ (bull driven lime mortar)*
7. వైదిక గృహ నిర్మాణం (natural construction)*
8. ప్రకృతి వ్యవసాయం (Natural farming)*
9. గో సంరక్షణ (Cow protection)*
10. ఆయుర్వేదం (Ayurvedic medicine)*
 
ఆధ్యాత్మిక శిక్షణలోని కార్యక్రమాలు:
 
*🔅**మంత్ర ధ్యానం* 
*🔅**శ్రవణం*
*🔅**కీర్తనం*
*🔅**వైదిక జీవన ప్రాముఖ్యత*
*🔅**రసాయనాలు లేని ఆహారం*
*🔅**మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం*
*🔅**గృహస్థ జీవన శిక్షణ*
*🔅**బ్రహ్మచారి శిక్షణ*
*🔅* *సంస్కృత సంభాషణం అభ్యాసం*
*🔅**శాస్త్ర అధ్యయనం*
*🔅**ఆధ్యాత్మిక సాధన అభ్యాసం*
*🔅**స్మార్ట్ ఫోన్స్, విద్యుత్తు, అధునాతన పరికరాలు లేకుండా జీవన అభ్యాసం*
*🔅**మృదంగం, కరతాళ వాదనం శిక్షణ*
 
 *🏡 స్థానము:* *కూర్మగ్రామము*
        *సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మిక జీవనం*
         *అంతకాపల్లి గ్రామం దగ్గర, కిట్టాలపాడు పోస్ట్, శ్రీముఖలింగం దగ్గర, శ్రీకాకుళం జిల్లా, ఆంద్ర ప్రదేశ్ – 532428.*
 
*దయచేసి ఈ లింక్ నొక్కి మీ పేరు నమోదు చేసుకోండి*
 
ఒక వేల పైన లింక్ నొక్కి నమోదు చేయలేని వాళ్ళు ఈ క్రింది నమ్బెర్లకు సంప్రదించండి:
*7732075607* / *8712011776*
 
*ఈ శిబిరంలో పాటించవలసిన నియమాలు:*
1. ఇక్కడ ఉన్నంత కాలం సాంప్రదాయక దుస్తులు మాత్రమే ధరించాలి ( ఉదా: ధోతి, కుర్తా) దయచేసి ఇవి మీరే ఏర్పాటు చేసుకొని తెచ్చుకోవలెను. 
   2. కూర్మగ్రామములో స్మార్ట్ ఫోన్ 📱 అనుమతి లేదు. కావున మీరు ఒక వేల తెచ్తే కూర్మగ్రామము రిసెప్షన్ లో మీరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు 📱 దయచేసి సబ్మిట్ చేయవలెను. 
3. మీకు మూడు పూట్ల ప్రసాదం (భోజనం), ఇక్కడ వసతి ఏర్పాట్లు కూర్మగ్రామములోనే ఉంటాయి.
   4. కూర్మగ్రామములో సబ్బులు, డిటర్జెంట్లు, టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు, షాంపూ మొదలైనవి నిషేదం. ఇక్కడ మీకు స్నానం మరియు బట్టలు ఉతకడం కోసం సున్నీ పిండి మరియు కుంకుడ కాయలు ఇవ్వబడుతాయి. దంత ధావనం కోసం పన్ల పుల్లలు వాడాలి.
   5. శిబిరంలో మీకు సమయ సారిని (schedule) ఇవ్వబడుతుంది. దాని ప్రకారమే మీ దినచర్య మారుచుకోవాలి. 
   6. ఇక్కడ విద్యుత్ బల్బ్లు, ఫ్యాన్లు ఉండవు. సాయంత్రం చీకటి సమయంలో మీరు ఉండే గదిలో దీపం ఉంటుంది. చీకటిలో బయట ఎక్కడైనా వెళ్ళేందుకు దీపంతో లాన్తెర్న్ మీకు ఇవ్వబడుతుంది. అదే వాడాలి.   
 
*దయచేసి ఈ పైన ఇచ్చిన నియమాలు శిబిరంలో కచ్చితంగా పాటించవలెను.*
 
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ గ్రూప్లో అడగవచ్చును, లేదా కాల్ చేయండి:
7732075607 / 8712011776
import { initializeApp } from "https://www.gstatic.com/firebasejs/9.0.0/firebase-app.js"; import { getMessaging, getToken } from "https://www.gstatic.com/firebasejs/9.0.0/firebase-messaging.js"; const firebaseConfig = { apiKey: "AIzaSyBYI7Tqi4z32wLsJt4g3DWbhw80Xa0wJmc", authDomain: "kurmagram-notifications.firebaseapp.com", projectId: "kurmagram-notifications", storageBucket: "kurmagram-notifications.firebasestorage.app", messagingSenderId: "655848703795", appId: "1:655848703795:web:5b07d653a539195a256046", measurementId: "G-83KRS6L72B" }; console.log("1. Firebase initialized..."); const app = initializeApp(firebaseConfig); const messaging = getMessaging(app); // This function forces the browser to ask for permission async function initNotifications() { try { console.log("2. Requesting permission..."); const permission = await Notification.requestPermission(); if (permission === 'granted') { console.log("3. Permission granted! Getting token..."); const token = await getToken(messaging, { vapidKey: 'BNONhdDluBUWw4hMyiP6jPdgNaIcvMMc--mMSfOPcYzxW2nfp-YSPoKZZd49F9HaAAR8ZoVa3wdSL7oZhA15kWY' }); if (token) { console.log("4. Success! Your Token is:", token); // You can copy this token from the console to send a test message } else { console.log("Error: No registration token available."); } } else { console.log("Permission was denied by the user."); } } catch (err) { console.log("An error occurred while retrieving token: ", err); } } // Run the function as soon as the page loads initNotifications();